ETV Bharat / state

వక్ఫ్​బోర్డు ఛైర్మన్​గా 4 ఏళ్లు.. అభివృద్ధి పనుల వివరణ

రాష్ట్ర వక్ఫ్​ బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీమ్ పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 4 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ నాలుగేళ్లలో చేసిన పలు అభివృద్ధి పనులను ఆయన వివరించారు.

mohemmed saleem has been the Chairman of the Waqf Board for 4 years
వక్ఫ్​బోర్డు ఛైర్మన్​గా 4 ఏళ్లు.. అభివృద్ధి పనుల వివరణ
author img

By

Published : Feb 24, 2021, 4:52 PM IST

తెలంగాణ వక్ఫ్​ బోర్డులో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆ బోర్డు ఛైర్మన్​ సలీమ్​ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వక్ఫ్ బోర్డు సభ్యులు, పలువురు ఉన్నతాధికారుల సహకారంతో ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్​గా 2017 ఫిబ్రవరి 24న బాధ్యతలు తీసుకున్నట్లు గుర్తు చేసుకున్న ఆయన.. ఇప్పటి వరకు రూ. 109.86 కోట్ల నిధులను వివిధ రకాల అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. సుమారు రూ.19.68 కోట్లు వక్ఫ్ బోర్డు ఆస్తుల కిరాయి వసూలు చేశామని తెలిపారు.

బోర్డు భూముల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసి, కబ్జాలకు గురైన వాటిని గుర్తించి తిరిగి సొంతం చేసుకుందని సలీమ్​ వివరించారు. ఈ సందర్భంగా కొన్ని సామాజిక మాధ్యమాలు వక్ఫ్​బోర్డుపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వీటిపై సుప్రీంకోర్టులో 12 కేసులు, హైకోర్టులో1,431 కేసులు, వక్ఫ్ ట్రిబ్యునల్​లో 1016 కేసులు, జిల్లా కోర్టులో 114 ఉండగా మొత్తం 2,892 కేసులు కోర్టుల్లో ఉన్నాయన్నారు. పలువురు ఉన్నత న్యాయవాదులతో కలిసి వాటిపై పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.