భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని పలువురు ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. మోదీ రాకతో అగ్రరాజ్యంతో వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ బుధవారం బయలుదేరి అమెరికాకు వెళారు. (Modi us visit 2021) వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి(PM Modi in Washington ) ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. ఆయనతో పాటు అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా, అమెరికా విదేశాంగ శాఖలోని మేనేజ్మెంట్, వనరుల విభాగం డిప్యూటీ టీహెచ్ బ్రియాన్ మెక్కియాన్లు.. హాజరయ్యారు.
ఇండియన్-అమెరికన్ల ఘన స్వాగతం
అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి వాషింగ్టన్‌లో ఇండియన్-అమెరికన్లు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన అమెరికాలు నాలుగు రోజుల పాటు సాగనుంది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యములో మోదీకి ఘన స్వాగతం లభించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా క్వాడ్ సదస్సు సహా ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశం, ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు మోదీ.
భారత ప్రధాని మోదీ.. అమెరికా పర్యటన పట్ల ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ అభివృద్ధికి అవసరమైన ఎన్నో ప్రాజెక్టులను ఆహ్వానించడం కూడా మోదీ పర్యటనలో భాగం. పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపి దేశ అభ్యున్నతికి అవసరమైన వనరులు, పెట్టుబడులు ఆహ్వానించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. -నరేంద్ర రేపాక, ప్రవాస భారతీయుడు
భారత ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ప్రధానంగా మూడు అంశాలను చర్చించవచ్చు. అందులో మొదటిది క్వాడ్ మీటింగ్, రెండోది అఫ్గనిస్తాన్ సమస్య, మూడోది ఇరుదేశాల ద్వైపాక్షిక విషయాలు గురించి చర్చించవచ్చు. -ఏనుగుల క్రిష్ణా రెడ్డి, ప్రవాస భారతీయుడు
భారత ప్రధాని మోదీ... పర్యటన ప్రధాన ఉద్దేశం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవడం. ఐక్యరాజ్యసమితిలో కూడా మోదీ మాట్లాడబోతున్నారు. అదే విధంగా మిగిలిన దేశాలతో కూడా తత్సంబంధాలు మెరుగు పరుచుకోడానికి భారత ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు. -విలాస్ జంబుల, ప్రవాస భారతీయుడు
ఇదీ చూడండి: Modi us visit 2021: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం