కరోనా నేపథ్యంలో ప్రజల మేలు కోసమే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా అన్నిరకాల పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆనవాయితీ ప్రకారం ఉదయమే తమ ఇంటి నుంచి తొలిబోనం సమర్పించామని తెలిపారు.
ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఉత్సవాలు కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలన్నారు. వైరస్ను తరిమికొట్టాలని ప్రజల పక్షాన అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు.