రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ రోజు ఉపరితల ద్రోణి తూర్పు విదర్భా నుంచి రాష్ట్రం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. వద్ద ఏర్పాటైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. వద్ద మరో ఉపరితల ద్రోణి ఏర్పాటైందని తెలిపింది. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చూడండి: Krishna Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ