రాష్ట్ర ప్రభుత్వం మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తక్షణమే వీడాలని మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండయ్య డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని కోరారు. దీక్షా శిబిరాన్ని శాసనమండలి సభ్యుడు నర్సిరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి:ఏడుగురికి డీఈవోలుగా పదోన్నతి