"ఈ బీఎస్ఎల్ 3ద్వారా రక్షణ ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను రూపొందించారు. ఈ ఘనత మొత్తం 'ఐ క్లీన్' సంస్థకు వెళుతుంది. ఈ ల్యాబ్స్ కొత్తవేమి కాదు. యూరప్, ఆఫ్రికా, యూఎస్‌లో కూడా ఉన్నాయి. నేను యూరప్‌లో 13 ఏళ్లు పని చేశాను. ఇది ఇండియాలో మాత్రం ప్రథమంగా చేస్తున్నాం. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌తో ఐ క్లీన్ సంస్థ పటిష్టంగా ఈ ల్యాబ్‌ను తయారు చేసింది. దీనితో ఒకరోజు 500 నుంచి 1000 కరోనా పరీక్షలు చేయవచ్చు. "
-డాక్టర్ మధు మోహన్, శాస్త్రవేత్త
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?