ETV Bharat / state

త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం సంచార శౌచాలయాలు - త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం సంచార శౌచాలయాలు

ఆర్టీసీ ఉద్యోగులకు సంచార శౌచాలయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఆర్టీసీ ఉద్యోగులకు అడక్కుండానే వరాలిచ్చారు. ముఖ్యంగా విధులు మారే సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు

MOBILE TOILETS IN TSRTC IN TELANGANA
MOBILE TOILETS IN TSRTC IN TELANGANA
author img

By

Published : Dec 4, 2019, 4:43 PM IST

త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం సంచార శౌచాలయాలు

గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈ విషయాన్ని మహిళా కండక్టర్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల సమ్మెకు వెళ్లే సమయంలో కార్మికులు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైన డిమాండే. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డు మీదే ఉంటాయి. బాగా తిరిగిన బస్సును వాళ్ల అవసరానికి తగ్గట్టుగా మార్చుకుని ఆ ప్రదేశంలో అందుబాటులో ఉంచుతారు. ఆ బస్సులో కేవలం డ్రెస్ చేంజ్ చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుంది. దీనివల్ల మహిళా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో శౌచాలయాలు, మంచినీటి సౌకర్యాలు పూర్తిస్థాయిల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ డిపోలను ఇప్పటికే సందర్శించారు. అందులో శౌచాలయాలు, మంచినీటి సౌకర్యాలను పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని ఆయా డిపో మేనజర్లకు సూచించారు.

బస్సులకు మార్పులు చేర్పులు చేసి...

ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారే ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు లేకపోవడం వల్ల అక్కడ పూర్తిస్థాయిలో శౌచాలయాల నిర్మాణం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. అందుకు మరో ఆలోచన చేశారు... అదే సంచార శౌచాలయాలు. సుమారు 37 వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులను వినియోగించాలని చూస్తున్నారు. అందులోనే అవసరమైన మార్పులు చేర్పులు చేసి... వాటిని మహిళా, పురుష ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు. వాటిలోనే డ్రెస్ చేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన గుత్తేదారులను పిలిచి వారితో చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో గుత్తేదారులను ఎంపిక చేసి... వెంటనే పనులు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

తిప్పలు తప్పునా...!

సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే... మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత తొందరగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

TG_HYD_01_04_MOBILE_TOILETS_IN_RTC_PKG_3182388 reporter : sripathi.srinivas నోట్ : ఆర్టీసీ బస్సులు, మహిళా కండక్టర్లకు సంబంధించిన ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఆర్టీసీ ఉద్యోగులకు సంచార శౌచాలయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఆర్టీసీ ఉద్యోగులకు అడక్కుండానే వరాలిచ్చారు. ముఖ్యంగా విధులు మారే సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఆదిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. Look.... వాయిస్ : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు విధులు మారేప్రదేశాల్లో (చేంజ్ ఓవర్ పాయింట్) చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ఈవిషయాన్ని మహిళా కండక్టర్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల సమ్మెకు వెళ్లే సమయంలో ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లలో ఇది కూడా ప్రధానమైన డిమాండే. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో విధులు మారే ప్రదేశాలు రోడ్డుమీదే ఉంటాయి. బాగా తిరిగిన ఆర్టీసీ బస్సును వాళ్ల అవసరానికి తగ్గట్టుగా మార్చుకుని ఆ ప్రదేశంలో అందుబాటులో ఉంచుతారు. ఆ బస్సులో కేవలం డ్రెస్ చేంజ్ మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ..మలమూత్రాలకు వెళ్లాలంటే ముఖ్యంగా మహిళా కార్మికులు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో శౌచాలయాలు, మంచినీటి సౌకర్యాలు పూర్తిస్థాయిలలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ డిపోలను ఇప్పటికే సందర్శించారు. అందులో శౌచాలయాలు, మంచినీటి సౌకర్యాలను పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని ఆయా డిపో మేనజర్లకు సూచించారు. వాయిస్ : ఆర్టీసీ ఉద్యోగులు విధులు మారే ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు లేకపోవడంతో అక్కడ పూర్తిస్థాయిలో సౌచాలయాల నిర్మాణం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. అందుకు మరో ఆలోచన చేశారు. అదే సంచార శౌచాలయాలు. సుమారు 37 సంచార సౌచాలయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులను వినియోగించాలని చూస్తున్నారు. అందులోనే అవసరమైన మార్పులు చేర్పులు చేసి...వాటిని మహిళా, పురుష ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు. వాటిలోనే డ్రెస్ చేంజ్, మంచినీటి సౌకర్యం, ఆహారం తినేవిధంగా అన్నిరకాల వసతులు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే వాటికి సంబంధించిన గుత్తేదారులను పిలిచి వారితో చర్చిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగులకు కావాల్సిన వసతుల కల్పనకు ఏ గుత్తేదారు తక్కువ బడ్జెట్ లో చేసేందుకు అంగీకరిస్తారో వారిని పిలవాలని చూస్తున్నారు. ఇప్పటికే రైల్వేకు పనిచేసిన గుత్తేదారులతో పాటు ఇతర కాంట్రాక్టర్లతో మంతనాలు జరిపారు. ఒకటి రెండు రోజుల్లో గుత్తేదారులను ఎంపిక చేసి...వెంటనే పనులు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. బైట్ : వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ ఈడీ. ఎండ్ వాయిస్ : సంచార శౌచాలయాలు అందుబాటులోకి వస్తే..మహిళా ఉద్యోగులకు తిప్పలు తప్పినట్లే అని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత తొందరగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.