ETV Bharat / state

MMTS Trains: అత్యంత పొదుపు.. సురక్షితం.. ఎంఎంటీఎస్​! - telangana news

MMTS Trains: పట్టణ రవాణా వ్యవస్థలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు (ఎంఎంటీఎస్‌) విశిష్టమైనది. హైదరాబాద్‌ జంట నగరాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన సబర్బన్‌ రవాణా వ్యవస్థలో ఎంఎంటీస్ అత్యంత పొదుపైనది..సురక్షితమైనది..సౌకర్యవంతమైంది. మొదటి దశ కరోనా సమయంలో ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. గత ఏడాది నుంచి దశలవారీగా తిరిగి సర్వీసులను పునరుద్ధరించారు. ప్రస్తుతం జంటనగరాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 86 సర్వీసులను నడిపిస్తున్నారు.

MMTS Trains:  అత్యంత పొదుపు.. సురక్షితం.. ఎంఎంటీఎస్​!

author img

By

Published : Apr 15, 2022, 5:15 PM IST

MMTS Trains: జంటనగరాల్లో అత్యంత కీలకమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్​ రైళ్లు. కొవిడ్ -19కు ముందు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు సేవలందించేవి. 1,65,000ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. కరోనా భారీగా విజృంభిస్తున్న సమయంలో 18 నెలలపాటు సర్వీసులు షెడ్డులకే పరిమితమైపోయాయి. దక్షిణ మధ్య రైల్వే జూన్‌ 2021 నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించింది. ప్రస్తుతం 86 సర్వీసులను నడిపిస్తోంది.

నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానిస్తూ ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, బేగంపేట్‌, లింగంపల్లి -తెల్లాపూర్‌ -రామచంద్రాపురం ప్రాంతాల మీదుగా 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల దక్షిణ మధ్య రైల్వే మేర ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ, గమ్యస్థానాలను బట్టి సరైన ప్రాధాన్యతిస్తూ వివిధ రంగాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసుల షెడ్యూలు ఏర్పాటు చేశారు. ఉద్యోగరీత్యా వెళ్లే వారికి, కుటుంబ అవసరాల మేరకు దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఉపయోగపడేలా ఎంఎంటీఎస్‌ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా,అనుకూలంగా ఉంటున్నాయి.

ఎంఎంటీఎస్‌ సర్వీసులు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 12.30 గంటల వరకు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఎంఎంటీఎస్ సర్వీసుల కనీస ఛార్జీ రూ.5గా, గరిష్ఠంగా రూ.15 ఛార్జీతో జంటనగరాల్లోని వివిధ ప్రజా రవాణా ఛార్జీలతో పోలిస్తే అతి చౌకగా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఇతర రవాణా వ్యవస్థతో పోలిస్తే రోజువారీ ప్రయాణికులకు తక్కువ ధరతో ఎంఎంటీఎస్‌ సీజనల్‌ టికెట్‌ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది. బుకింగ్‌ కౌంటర్లలోనే కాకుండా ఎంఎంటీఎస్‌ టికెట్లను ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు, అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.