హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. లింగంపల్లి నుంచి నాంపల్లి వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు హాఫీజ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటన వల్ల లింగంపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు 3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఇవీ చూడండి : పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్... ఆలస్యంగా పలు రైళ్లు