ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హామీ ఇచ్చారు. వరద బాధితులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఫాక్స్ సాగర్ చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. తదుపరి చర్యల కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, డీసీపీ పద్మజ రెడ్డి, జోనల్ కమిషనర్ మమతతో చర్చించారు. సుభాష్ నగర్ డివిజన్‌లోని పలు కాలనీల్లో వరద నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వరద బాధితులకు రేషన్ కిట్లు అందజేశారు.
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని వారు ఇళ్లను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తూము ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం