లక్షల రూపాయల ఫీజులు ఆన్లైన్ క్లాసుల పేరుతో డబ్బులు దండుకుంటూ... ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.
హైదారాబాద్ మాదాపూర్లోని శ్రీచైతన్యలో పనిచేసే ప్రైవేటు ఉపాధ్యాయులు వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. ఆందోళనకు మద్దతుగా భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు నిరసనలో పాల్గొన్నారు. విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఎలాంటి జీతాలు చెల్లించడం లేదు. శ్రీచైతన్య విద్యాసంస్థలు అవలంభిస్తోన్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వంద మంది ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు.. వివిధ సంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.