ETV Bharat / state

Palla on Bandi: రైతులపై దాడులకు దిగి అరాచకం సృష్టించారు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

author img

By

Published : Nov 15, 2021, 10:45 PM IST

ధాన్యం కొనుగోళ్లపై మీ విధానమేంటో స్పష్టం చేసిన తర్వాత బండి సంజయ్(bandi sanjay) రాష్ట్రంలో తిరగాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLC palla rajeshwar reddy) డిమాండ్ చేశారు. రైతుల కల్లాల సందర్శన పేరుతో నల్గొండ రైతుల రక్తం కళ్ల చూశారన్నారు. దాడులకు పాల్పడిన భాజపా నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

MLC palla rajeshwar reddy
MLC palla rajeshwఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిar reddy

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) తన అనుచరులతో కలిసి నల్గొండ జిల్లా రైతులపై దాడులకు దిగి అరాచకం సృష్టించారని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLC palla rajeshwar reddy) ఆరోపించారు. బండి సంజయ్ పర్యటన ఆంతర్యమేంటో చెప్పాలని రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై భాజపా వైఖరేంటో స్పష్టం చేసిన తర్వాతే బండి సంజయ్ తిరగాలన్నారు.

రైతుల కల్లాల సందర్శన పేరుతో రైతుల రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన భాజపా నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన అనుచరులతో కలిసి రైతులపై దాడి చేసి.. వారిపైనా దాడి జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌ను కదిలించే ప్రయత్నం చేస్తే ప్రళయం వస్తుందని హెచ్చరించారు. రైతుల విషయంలో బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరులతో కలిసి రైతులపై దాడి చేసి.. వారిపైనా దాడి జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ కదిలించే ప్రయత్నం చేస్తే ప్రళయం వస్తుందని హెచ్చరించారు. బండి సంజయ్ రైతులపై బందిపోటులా దాడి చేశారని.. తీరు మార్చుకోక పోతే రైతులు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి హెచ్చరించారు.

ఒక వైపున ఇప్పటికే రైతులు యాసంగి పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లుగా ధాన్యం సేకరిస్తోంది. వానాకాలం పంటను సేకరించేందు 4500 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది. నీవు ధాన్యం కొనుగోళ్లను అడ్డుకుని ఇబ్బందులు సృష్టించే విధంగా రైతులను రెచ్చగొడతారా? నీతో ఏకీభవించకపోతే రైతులపై రాళ్లతో దాడులు చేయిస్తారా? నల్గొండ కేంద్రంలో సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను అడ్డుకుంటారా? అర్జాలబావి, తిప్పర్తి, మిర్యాలగూడలోని శెట్టిపాలెం, యాదగిరిపల్లి.. హుజూర్​నగర్​లో ఉన్న చిల్లేపల్లి, నేరేడుచర్ల, గడ్డిపల్లి దగ్గర రైతుల రక్తం కళ్ల చూడడం జరిగింది. బండి సంజయ్, భాజపా గూండాలు కలిసి రైతులను కొట్టడం జరిగింది. కేంద్రమే యాసంగిలో వరి వేయొద్దని లేఖలు రాస్తారు. మరి ఇక్కడేమో ధాన్యం కొనడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. వరి కొనకపోతే మెడలు వంచి కొనిపిస్తానని బూటకపు మాటలు చెప్తారు. పంజాబ్​లో ప్రతిగింజా కొంటున్నారు. తెలంగాణలో ఎందుకు కొనరు. నువ్వు ధాన్యంపై కొంటామని హామీ ఇస్తేనే నిన్ను తిరగనిస్తాం. రైతులపై దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి.-

పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ

MLC palla rajeshwar reddy

ఇదీ చూడండి:

Bjp vs TRS: రణరంగాన్ని తలపించిన బండి టూర్​.. తెరాస, భాజపా శ్రేణుల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.