ETV Bharat / state

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి వీడాలి' - hyderabad latest news

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ హైదరాబాద్​ ధర్నాచౌక్​లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

MLC NARSIREDDY protest
'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి వీడాలి'
author img

By

Published : Mar 5, 2020, 8:02 PM IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈనెల 13 న తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. పీఆర్సీ అమలు, సీసీఎస్​ రద్దు చేయాలని.. ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ ఔట్​సోర్సింగ్​లేని తెలంగాణ సాధించుకుందామని ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి వీడాలి'

ఇదీ చూడండి: 'పేదలకు, రైతులకు ప్రాధాన్యతనిచ్చే విధంగానే బడ్జెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.