MLC Madhusudhanachari: హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని హయత్నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి హాజరయ్యారు. విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని అభినందించారు.
విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు. విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారిని వారు కోరారు.
ఇదీ చదవండి: రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్