MLC Kavitha who visited the National Book Fair: అనేక మంది గొప్ప కవులు, కళాకారులలో ఉన్నది తెలంగాణ వారసత్వమనీ, ప్రజల హృదయాల్లో తరతరాలకు గుర్తుండిపోయేలా వారు రచనలు చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న 'వల్లంకి తాళం' రచన చేశారని కవిత కొనియాడారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన 'వల్లంకి తాళం' పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ సురవరం ప్రతాపరెడ్డికి వచ్చిందని, అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగుతూనే ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పనుల్లోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని, అదేవిధంగా తెలంగాణలో కూడా మన కష్టాలను, శ్రమను పదాలుగా వినియోగిస్తున్నామని తెలిపారు. మట్టి తత్వం అణువణువునా గోరటి వెంకన్న రచనల్లో ఉంటుందన్నారు.
చిన్న చిన్న పదాలతో రచయిత గోరటి వెంకన్న అద్భుతంగా రచన చేశారన్నారు. అడవిపై ఉన్న పదాలను ఎమ్మెల్సీ కవిత చదివి వినిపించారు. నల్లమలలో యురేనియం తవ్వడాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. గోరటి వెంకన్న పుట్టిన ఈ కాలంలో పుట్టినందుకు గర్వంగా ఉందని, తనతో పాటు కౌన్సిల్లో కూర్చోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఇవీ చదవండి: