Kavitha On LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్న ఆమె... సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 102 పెంచడం ఎన్నికల తర్వాత అతి పెద్ద ధరల పెంపుగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, సామాన్యులపై భారం మోపుతోందని ధ్వజమెత్తారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుదల ఇదే.
-- కవిత, ఎమ్మెల్సీ
-
The actions and decisions of the Modi Government reflect on their insensitivity towards the common man.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
The price is of #LPG Commercial Cylinder has been hiked by 102₹, second major hike after elections.
What does the Govt expect, people to shut the shops and sit at home? https://t.co/w7ZLMS7Jzc
">The actions and decisions of the Modi Government reflect on their insensitivity towards the common man.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2022
The price is of #LPG Commercial Cylinder has been hiked by 102₹, second major hike after elections.
What does the Govt expect, people to shut the shops and sit at home? https://t.co/w7ZLMS7JzcThe actions and decisions of the Modi Government reflect on their insensitivity towards the common man.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2022
The price is of #LPG Commercial Cylinder has been hiked by 102₹, second major hike after elections.
What does the Govt expect, people to shut the shops and sit at home? https://t.co/w7ZLMS7Jzc
వీ చదవండి: 'ప్రభుత్వాలే అతిపెద్ద కక్షిదార్లు... కేసుల జాప్యానికి ఇదీ కారణమే!'
BANDI SANJAY: తెరాసపై విమర్శల ఘాటు పెంచిన బండి.. కేసీఆర్కు సవాల్..!