MLC Jeevan Reddy Latest News : ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన జనగర్జన సమావేశంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ నాలుగు వేలు ప్రకటిస్తే.. దానిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుపేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు.
Congress party RS.4000 Pension : బీఆర్ఎస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పింఛన్ రూ.4 వేలు ఎందుకు ఇవ్వడం లేదని ఎలా ప్రశ్నిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏదైనా పథకాన్ని అమలు చేయాలంటే.. స్థానిక పరిస్థితుల ఆధారంగా అమలు చేస్తారని గుర్తు చేశారు. ఈ మాత్రం పరిజ్ఞానం లేకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎవరు అనడం సరికాదని.. ఆ వ్యాఖ్యలు చేసే ముందు వారి స్థాయి తెలుసుకోవాలని హెచ్చరించారు.
Jeevan Reddy Fires on KCR : 'ఆర్నెళ్లలో కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తారు'
Jeevan Reddy hot comments on KTR : బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే.. కావాల్సిన అంశాలు అడగాలని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమకు ఏమీ వద్దని అన్నారని తెలిపారు. దీంతో పాటు ప్రధాని ప్రేమ చాలని ఎలా అంటారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి అమిత్ షా ముందు లొంగిపోయాడన్న వ్యాఖ్యలో నిజం ఉందని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా ఉందని.. అందువల్లే దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి ఎమ్మెల్సీ కవితను మినహాయింపు చేశారని ఆరోపించారు.
80 సీట్లు గెలుస్తాం..: దేశంలో ప్రతి పార్టీకి సిద్దాంతం ఉంటుందని.. ఏ సిద్దాంతం లేని పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు కేసీఆర్ సర్కార్ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన సభ రాబోయే ఎన్నికల్లో విజయానికి నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిని బయటకు తీసి.. బోనులో నిలబెడతామని హెచ్చరించారు.
"ఖమ్మం సభపై బీఆర్ఎస్ నాయకులు అవాక్కులు చివాక్కులు మాట్లాడుతున్నారు. పింఛన్ రూ.4 వేలు ఇస్తామని ప్రకటిస్తే .. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. నిరుపేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకం ప్రకటించాం. రాష్ట్రానికి ప్రధాని వస్తే.. రాష్ట్రానికి కావాల్సిన అంశాలు అడగాలి. కానీ కేసీఆర్ మాకు ఏమీ వద్దు.. మీ ప్రేమ చాలు అని ఎలా అంటారు. కేటీఆర్ అమిత్ షా ముందు మోకరిల్లిండు.. ఇది నిజం కాదా? కవితకు లిక్కర్ కేసు నుంచి మినహాయింపు నిజం కాదా?" -జీవన్ రెడ్జి, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి :