ETV Bharat / state

'గ్రేటర్​ ఫలితం దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ప్రయత్నం' - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

గ్రేటర్​ ఎన్నికల్లో తెరాసకు జరిగిన నష్టం నుంచి దృష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సే జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ కన్నా సౌకర్యవంతమైన రోడ్లు అవసరమని ఆయన అన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జాతీయ హోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

mlc-jeevan-reddy-fire-on-cm-kcr-about-kaleshwaram-project
గ్రేటర్​ ఫలితం దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ప్రయత్నం: జీవన్‌ రెడ్డి
author img

By

Published : Dec 13, 2020, 5:49 PM IST

రాష్ట్రంలో ఎయిర్‌ పోర్టుల కన్నా సౌకర్యవంతమైన రహదారులు అవసరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. విమానాశ్రయాల గురించి సీఎం కేసీఆర్‌ ప్రస్తావించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు అన్ని ప్రాంతాల నుంచి కనెక్టవిటి ఉండేట్లు రహదారులు నిర్మిస్తే సరిపోతుందన్నారు. రెండో సారి తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుందన్న జీవన్‌ రెడ్డి... కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరడం ఏంటని ప్రశ్నించారు. డీపీఆర్‌ కేంద్రానికి ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి... ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జాతీయ హోదా ఎలా అడుగుతారని నిలదీశారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు జరిగిన నష్టం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ నీరు ఎవరూ తాగడం లేదని, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆయన తెరాస కార్యకర్తలు ఆ నీరు తాగుతున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో ఎన్నికలు ఉండడం వల్లే రూ.పదివేలు ఇచ్చారని... రైతులను విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకు రాలేకపోతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని విమర్శించారు.

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కేసీఆర్ నెత్తిన ఎక్కించుకున్నారని ఆరోపించారు. ఆయనేమో పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఏపీకి తీసుకుపోతుంటే... కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ తన కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చుకున్నారని, నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారని ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్ష కోసం పని చేసిన వారెవరూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయలేదని... రాష్ట్రానికి వ్యతిరేకంగా పని చేసిన వారే తెరాసకు ఓట్లు వేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి: పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.