ETV Bharat / state

MLC Jeevan Reddy: "రుణమాఫీ అమలుపై కేసీఆర్​కు చిత్తశుద్ధి లేదు" - MLC Jeevan Reddy on Runa Mafi

MLC Jeevan Reddy on Runa Mafi: వ్యవసాయ సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతు బంధు పేరుతో వ్యవసాయ రాయితీలు నిలివేశారన్న ఆయన.. రుణమాఫీ అమలుపై కేసీఆర్‌ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రూ.75 వేలకు పైగా ఉన్న అప్పు ఎప్పుడు మాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద జీవన్​ రెడ్డి మాట్లాడారు.

mlc jeevan reddy
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి
author img

By

Published : Mar 16, 2022, 1:50 PM IST

MLC Jeevan Reddy on Runa Mafi: శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు కేవలం 4 రోజులే జరిగాయని.. అందులో రెండు రోజులే చర్చించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తెరాస సర్కార్​ దాటవేసిందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

చిత్తశుద్ధి లేదు

రైతు బంధు ఇచ్చి... అన్నదాతలకు అందాల్సిన అన్ని రాయితీలు ఆపేశారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. రుణమాఫీపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. పంటరుణాలపై 4శాతం వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని సాకుగా చూపి ధాన్యం సేకరణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడం దారుణమని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

రైతుల ఆందోళన

"ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్​.. రూ. 34 వేల వరకే మాఫీ చేశారు. మిగిలిన రుణానికి సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. రూ. 75 వేలకు పైగా ఉన్న అప్పు ఎప్పుడు మాఫీ చేస్తారు.? వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. మరో నెల రోజుల్లో వరి కోతలు మొదలవుతాయి. ధాన్యం సేకరణపై రైతులు అందోళన చెందుతున్నారు." -జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

చక్కెర కర్మాగారాలు తెరవాలి

సమావేశాల్లో నిజాం చక్కెర కర్మాగారంపై మండలిలో లెవనెత్తితే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని జీవన్​ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చక్కెర కర్మాగారాలు ప్రారంభమైతే 3 లక్షల ఎకరాల్లో వరి సాగు నుంచి చెరుకు వైపు మల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్పి పూర్తిగా మూసివేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రుణమాఫీ అమలుపై కేసీఆర్‌ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: జీవన్‌రెడ్డి

ఇదీ చదవండి: KTR Inaugurates LB Nagar Underpass : 'కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు తీసుకురావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.