ETV Bharat / state

MLA Rekha Naik Congress Ticket : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న MLA రేఖా నాయక్

MLA Rekha Naik Congress Ticket 2023 : ఖానాపూర్​ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్​లో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రేఖా నాయక్ దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

MLA Rekha Naik Congress Ticket
MLA Rekha Naik
author img

By

Published : Aug 22, 2023, 12:14 PM IST

Updated : Aug 22, 2023, 1:15 PM IST

MLA Rekha Naik Congress Ticket 2023 : కాంగ్రెస్ టికెట్ కోసం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం రేఖా నాయక్ దరఖాస్తు చేయడంతో ఈ విషయం కాస్త రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు గాంధీభవన్‌లో దరఖాస్తును రేఖా నాయక్‌ పీఏ అందజేశారు. అలాగే ఆసిఫాబాద్ టికెట్‌ కోసం రేఖా నాయక్ భర్త శ్యామ్ ​నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ ​నాయక్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

MLA Rekha Naik Applies For Congress Ticket : నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్(Khanapur BRS MLA Rekha Naik) ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ ​నాయక్‌ హస్తం కండువా కప్పుకున్నారు. సోమవారం రోజున సీఎం కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తనకు చోటు దక్కకపోవటంపై నిరాశకు గురైన రేఖా నాయక్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఎవరు మోసం చేసినా.. నియోజకవర్గం ప్రజలంతా తన వెంటనే ఉన్నారని ఆమె తెలిపారు. అయితే ఆమె పార్టీ మారకముందే.. కాంగ్రెస్​లో ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది.

Telangana Congress MLA Candidates List : సెప్టెంబర్​లో కాంగ్రెస్​ అభ్యర్థుల తొలి జాబితా

Telangana BRS MLA Candidates List 2023 : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా బీఆర్ఎస్ సిట్టింగ్​లు అందరికీ టికెట్లు లభించగా.. అవకాశం దక్కని వారిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ శాసనసభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్‌ బీఆర్ఎస్​ను వీడేందుకు సిద్ధమయ్యారు. రేఖా నాయక్ స్థానంలో జాన్సన్ రాఠోడ్ నాయక్​కు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలోని అనుచరులు రేఖా నాయక్‌ కార్యాలయానికి చేరుకున్నారు. టికెట్‌ దక్కకపోవటంతో కార్యకర్తల వద్ద ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

BRS MLA Rekha Naik Joins Congress : 2014లో టీడీపీ అభ్యర్థి రాఠోడ్‌ రితేశ్‌పై బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన రేఖా నాయక్‌ తొలిసారిగా గెలుపొందారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాఠోడ్‌పై రెండో సారి ఆమె గెలుపొందారు. ఎస్టీ కోటాలపై మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించినప్పటికీ.. అవకాశం లభించలేదు. తీరా ఈసారి పార్టీ టికెట్‌ సైతం రాకపోవటంతో దిగ్భ్రాంతికి గురైన రేఖా నాయక్‌.. ఎవరు తనను మోసం చేసినా, పోటీ చేసేది మాత్రం పక్కా అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్​ను వీడాలని రేఖా నాయక్ నిర్ణయం : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన(BRS MLA Candidates List 2023) అనంతరం, ముఖ్య అనుచరులతో సమావేశమైన రేఖా నాయక్‌.. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే ఆమె భర్త శ్యామ్​ నాయక్‌.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్​లోని రేవంత్​రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. శ్యామ్​ నాయక్‌ని రేవంత్​రెడ్డి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఠాక్రేతో శ్యామ్ భేటీ అయ్యారు. ఇవాళ రేఖా నాయక్‌ సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

BRS MLA Rekhanayak Join Congress Today : నేడు కాంగ్రెస్‌ గూటికి ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

Last Updated : Aug 22, 2023, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.