ETV Bharat / state

తెలంగాణకు బుల్డోజర్లు...తెచ్చేందుకు సంజయ్‌ దిల్లీ వెళ్లారు - mla rajasingh sensational comments

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ బుల్డోజర్ల కోసం ఆర్డర్​ చేశారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్​ వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను ఎక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

mla rajasingh
mla rajasingh
author img

By

Published : Mar 17, 2022, 1:39 PM IST

Updated : Mar 17, 2022, 3:57 PM IST

సంజయ్​ దిల్లీ వెళ్లారు.. తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్​: రాజాసింగ్​

ఈటలను ఆడుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్​ అన్నారు. ఈటల రాజేందర్​, బండి సంజయ్ వ్యక్తులు కాదని శక్తులని రాజాసింగ్​ అన్నారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు మసైపోతారని వ్యాఖ్యానించారు. భాజపా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. అవినీతి పరులను బుల్డోజర్​తో తొక్కించారని రాజాసింగ్​ వ్యాఖ్యానించారు. బండి సంజయ్​ దిల్లీ వెళ్లారని.. తెలంగాణకు బుల్డోజర్లు రాబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రతినియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్​ చేశామని.. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి వాటిని పంపిస్తామన్నారు. భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్​రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులకు నేతలు సహా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. రాబోయేది భాజపా ప్రభుత్వమేనని రాజాసింగ్​ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: Etela Rajender on kcr: 'మిస్టర్​ ముఖ్యమంత్రి.. నిన్ను ఎవరూ కాపాడలేరు'

Last Updated : Mar 17, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.