తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో తెలపాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. హోంమంత్రిని కోరారు. ఈ మేరకు హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉగ్రవాదుల నుంచి హాని ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి లేఖ వచ్చిందని రాజాసింగ్ హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ద్విచక్ర వాహనంపై తిరుగొద్దని తనుకు సూచించినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత గన్ లైసెన్స్ కూడా రెండేళ్లుగా కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉందని హోంమంత్రి వద్ద ప్రస్తావించారు. తనకు సీపీ పంపిన లేఖపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని హోంమంత్రిని కోరారు.