హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని నేతాజీ బస్తీలో పేదలకు భాజపా నాయకుడు ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ బస్తీ వాసులకు నిత్యావసర సరకులను అందజేశారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును... ప్రతి ఒక్క భాజపా కార్యకర్త పాటిస్తున్నారని తెలిపారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతి బస్తీలో పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేయాలని పార్టీ నేతలను కోరారు.