హైదరబాద్‌లోని చైతన్యపురి సీఐ రవికుమార్‌పై ఏసీపీకి ఫిర్యాదు చేస్తున్నామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగడంలో భాజపా కార్యకర్తలు ముందుంటారని రాజాసింగ్ పేర్కొన్నారు.