గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో గోహత్యపై నిషేధం విధిస్తూ.. చట్టం రానంత వరకు మూకదాడులు ఆగవన్నారు. అప్పటివరకు ఇలాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయే తప్ప తగ్గవని స్పష్టం చేశారు. గోవులను వధిస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని.. వారిని అడ్డుకునేందుకు మూకదాడులు తప్పవన్నారు. మధ్యప్రదేశ్ మాల్వాలోని బాగుల్ ముఖి ఆలయానికి వెళ్లిన రాజాసింగ్ అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. జనాభా నియంత్రణపై కూడా దృష్టి సారించాలని ఎర్రకోట ప్రసంగంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు.
ఇవీచూడండి: 'కశ్మీర్'పై పాకిస్థాన్‌ది అదే పెడ ధోరణి