RaghunandanRao Fires on Minister KTR: ప్రధానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రధాని కుర్చీకి కూడా గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పరువు నష్టం దావాలను తప్పించుకోవడానికి కొత్త పద్ధతి నేర్చుకున్నారని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్ రావు... మంత్రి కేటీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
MLA RaghunandanRao interesting comments: ఆ వేములవాడ రాజన్న వారికి సరైన సమయంలో కేటీఆర్‌కు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టామని చెబితే బాగుండేదని విమర్శించారు. నరేంద్ర మోదీ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడరని మండిపడ్డారు. సరైనా ఆధారాలు లేకుండా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
MLA RaghunandanRao Allegations on ktr ప్రభుత్వ భూమి అని కోర్టు ఆర్డర్ ఇచ్చాక హాఫిజ్ పేటలోని సర్వే నంబర్ 77లో 8 ఎకరాలు భూమిలో మున్సిపల్ మంత్రిగా అనుమతి ఇచ్చిన మాట వాస్తవమా? కాదా అని ప్రశ్నించారు. వారికి అనుకూలంగా ఉన్న వాళ్లకు అక్రమ భవనాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు.
మంత్రి కేటీఆర్.. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ''ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా... ప్రధాని మోదీ మీద ఏదైనా మాట్లాడితే లోపల వేయాలని అన్నారు. అదే నిజం అయితే ఇప్పుడు లోపల వేయాల్సింది మంత్రి కేటీఆర్‌నే'' అని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై మాట్లాడిన మాటలు పొరపాటు జరిగిందని చెబుతారని ఆశిస్తున్నామని ఆయన వివరించారు.
ఈ దేశ ప్రధాన మంత్రిని ఎవరు కించపరిచినా.. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ప్రధాన మంత్రి మీద ఏవరైనా మట్లాడితే వారిని తీసుకొచ్చి లోపల వెయ్యమన్నారు. సీఎం కేసీఆర్ మాట శాశనం అయితే ముందుగా లోపల వేయ్యాల్సింది కేటీఆర్‌నే. ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు.. ప్రధాన మంత్రి అనే వారి స్థాయిని గుర్తించకుండా మాట్లాడారు. నిన్న మీరు సిరిసిల్లలో మాట్లాడిన పదాలన్నిటినీ విత్‌డ్రా చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి పదాలు రాకుండా చూసుకోవాలని కోరుతున్నా. ఆయనకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నా... -రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇవీ చదవండి: