ETV Bharat / state

"ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించారు - ఫార్మ్‌హౌస్‌ విషయాలు త్వరలో వెల్లడిస్తా" - accused nanda kumar

MLA Poaching Case Accused Nanda kumar : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను కావాలని ఇరికించారని నిందితుడు నందకుమార్‌ ఆరోపించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఫార్మ్‌హౌస్‌లో జరిగిన విషయాలన్నీ త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులన్నిటిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

MLA Poaching Case updates
MLA Poaching Case Accused Nanda kumar
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 5:58 PM IST

MLA Poaching Case Accused Nanda kumar : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో(MLA Poaching case) తనను కావాలని ఇరికించారని నిందితుడు నందకుమార్‌ పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నంద కుమార్ మీడియాతో మాట్లాడారు. తనకు సింహయాజులు స్వామీజీని దాసోజు శ్రావణ్ పరిచయం చేశారని, ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఫార్మ్‌హౌస్‌లో జరిగిన విషయాలన్నీ త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు.

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది : సైబరాబాద్ సీపీ

తనపై కక్ష కట్టి కేసులో ఇరికించి బిజినెస్‌ను దెబ్బతీశారని నందకుమార్‌(Nandakumar) వాపోయారు. జైల్లో ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు లీగల్‌గా అనుమతులు ఉన్న తన హోటల్‌ను నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని, తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో అప్పటి పోలీసులు వేధించారని, తాను బయటకు రాకుండా చేశారన్నారు. డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాలని చూశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనపై నమోదైన కేసులన్నిటిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. త్వరలో డీజీపీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు.

'ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వొద్దు..'

"ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నన్ను కావాలని ఇరికించారు. ప్రస్తుతం కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. నేను నిందితుడినా, బాధితుడినా అన్న విషయం త్వరలో తెలుస్తుంది. ఫార్మహౌస్‌లో జరిగినా విషయాలు త్వరలో వెల్లడిస్తాను. జైల్లో ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు లీగల్‌గా అన్ని అనుమతులు ఉన్న నా హోటల్‌ను నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. త్వరలో ముఖ్యమంత్రిని, డీజీపీని కలుస్తాను". - నందకుమార్

"ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఇరికించారు- ఫార్మ్‌హౌస్‌ విషయాలు త్వరలో వెల్లడిస్తా"

అసలేం జరిగిందంటే: గతేడాది అక్టోబర్‌ 26న హైదరాబాద్‌ శివారులోని మెయినాబాద్‌లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఎరకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్‌ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు బేరసారాలకు జరుగుతున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్‌ జైల్లో ఉండగానే అతని హోటల్‌ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఫిలింనగర్‌ చౌరస్తాలోని డెక్కన్‌ కిచెన్‌ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు.

డెక్కన్‌ కిచెన్ లీజు అంశం కేసు.. రెండోరోజు నందకుమార్​ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.