కరోనాను ఎదుర్కొంటూనే రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని రైతుబంధు సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. హార్వెస్టర్లు, లారీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించిట్లు వివరించారు. రోజుకు సగటున 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. కష్టకాలంలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఈ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. రైతులు ధాన్యం విషయంలో ఎఫ్‌సీఐ నిబంధనలు పాటించాలన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మరోమారు స్పష్టం చేశారు. దాదాపు 14 వేల గ్రామాలు, 8 వేల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని ప్రకటించారు. వందకు వంద శాతం ప్రభుత్వమే ధాన్యం కొంటున్న రాష్ట్రం మరేదీ లేదని ఉద్ఘాటించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే కాంగ్రెస్, భాజపాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రేపు భాజపా ఎందుకు దీక్ష చేస్తుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దీక్షల పేరిట చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. క్షేత్ర స్థాయికి వెళ్ళలేక, సమాచారం లేక కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్