ETV Bharat / state

భాగ్యనగర ప్రజలపై సీఎం కేసీఆర్ వరాలజల్లు : పద్మాదేవేందర్ రెడ్డి

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. భాగ్యనగర ప్రజలపై సీఎం.. వరాలజల్లు కురిపించారని హర్షం వ్యక్తం చేశారు.

mla padma devender reddy in ghmc election campaign
తెరాస జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో
author img

By

Published : Nov 24, 2020, 8:00 AM IST

బల్దియా ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో బడుగు బలహీన వర్గాల మేనిఫెస్టోలా ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. భాగ్యనగర అభివృద్ధే తెరాస సర్కార్ ధ్యేయమని తెలిపారు.

సికింద్రాబాద్​లో మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల చిత్రపటానికి పద్మాదేవేందర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. 25వేల లీటర్లలోపు నీటిని వినియోగించేవారికి బిల్లులు రద్దు చేయడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందని స్పష్టం చేశారు.

గతంలో ఆదరించినట్లుగానే.. బల్దియా బరిలోనూ తెరాసకు ఓటు వేసి జీహెచ్​ఎంసీ పీఠాన్ని తెరాస వశం చేయాలని మైనంపల్లి హనుమంతరావు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.