ETV Bharat / state

అనాథ శరణాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు న్యూస్​

మైనంపల్లి హనుమంతరావు గొప్ప నాయకుడిగా ఎదగాలని ఎమ్మెల్సీ దయాకర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. బన్సీలాల్ పేట్​లోని అనాధ శరణాలయంలో నిర్వహించిన హనుమంతరావు జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

mla mynampally hanumantha rao birthday celebration in orphanage
అనాథ శరణాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
author img

By

Published : Jan 10, 2021, 4:28 PM IST

మల్కాజి​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను మైనంపల్లి ట్రస్ట్ సభ్యులు బన్సీలాల్ పేట్​లోని అనాధ శరణాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన హనుమంతరావు గొప్ప నాయకుడిగా ఎదగాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే హనుమంతరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దయాకర్​ రావు అనాధ బాలికతో కేక్ కట్ చేయించి వారికి అన్నదానం చేశారు. శరణాలయంలో ఉన్న పిల్లలకు వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. నిత్యం సామాన్య ప్రజానికానికి సేవ చేస్తున్న హనుమంతరావు ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.