హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ ఎంసీహెచ్ కాలనీ పార్సీగుట్టలో తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రంలో శాసనసభ్యుడు ముఠా గోపాల్, తెరాస యువజన నేత ఎం జైసింహ పాల్గొని కార్మికులకు సరకులు అందించారు.
లాక్డౌన్ ముగిసేవరకు ఇదే విధంగా కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కొనసాగాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చూడండి : 'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'