ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నియమాలను కచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. కవాడిగూడ పూల్‌బాగ్, బండా నగర్లో అప్సర ఫౌండేషన్, టెక్ మహీంద్రా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరకులను ఆయన పంపిణీ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, పెద్ద, వయో వృద్ధులు, కులం, మతం అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోందని ముఠా గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలను అందరూ వినియోగించుకోవాలన్నారు.
కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జైసింహ, లక్ష్మీ గణపతి దేవస్థానం ఛైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, అప్సర డైరెక్టర్ ప్రవీణ్, కో-ఆర్డినేటర్ రమేష్, ఆర్గనైజర్ అప్స పద్మ, అరుణ, అరుణా దేవి, అంగన్వాడీ టీచర్లు, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి..'ఈటీవీకి పాతికేళ్ల పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్'