సమాజాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దడానికి ప్రజలు స్వచ్ఛందంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కవాడిగూడ డివిజన్లోని రోటరీ కాలనీలో కార్పొరేటర్ లాస్యనందితతో కలిసి ఆయన మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టటానికి మొక్కలు నాటడమే శ్రీరామరక్ష అని ఆయన వివరించారు.
అలాగే ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్లో అరుణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడటానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.