MLA MLC Seats Election in Telangana : మండలి ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. రెండు సీట్లకు విడిగా ఉపఎన్నికలు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణం. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అప్పటినుంచి రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. రెండు స్థానాల భర్తీకి గురువారం షెడ్యూల్(Telangana MLC Election Schedule) ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం విడిగా ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. నామినేషన్ల జోరు
Telangana MLA Kota MLC Election Schedule : రాష్ట్రానికి చెందిన రెండు సీట్లతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక స్థానానికి కలిపి విడిగా మొత్తం మూడు ఉపఎన్నికలకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా ఈసీ విడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. ఆ రోజు రాష్ట్ర అధికారిక గెజిట్‌లో విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. అంటే రెండు స్థానాలకు విడిగా ఉపఎన్నికలు జరుగుతాయి.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు 'కారు' సన్నద్ధత.. శిబిరాలకు ప్రజాప్రతినిధులు
Telangana MLC Election Schedule 2024 : రెండు స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు ఒకే షెడ్యూల్ ప్రకారం జరగుతాయి. అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్లను రెండు నోటిఫికేషన్లకు అనుగుణంగా విడిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోలింగ్ జరిగితే రెండు బ్యాలెట్లు వినియోగిస్తారు. ప్రస్తుతం శాసనసభ బలాబలాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున రెండు స్థానాలకు విడిగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీ రెండు స్థానాలను
MLC Election Schedule 2024 : రెండు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు శాసనసభ కోటా నుంచి ఎన్నికైనందున వారి స్థానంలో ఎమ్మెల్యేలు ఇద్దరినీ పెద్దల సభ(Legislative Council)కు ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉపఎన్నిక కోసం ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఇవ్వనుంది.
ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 90.40శాతం ఓటింగ్ నమోదు
Telangana MLC Seats : తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్ పార్టీకు చెందిన ఇద్దరు సభ్యులు, బీజేపీ తరఫున ఒక్కరు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో మరో స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
MLC Elections Polling 2021 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం