హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నాంపల్లి ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్ సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ కొరత గురించి.. ఆర్ఎంఓని అడిగి తెలుసుకున్నారు. తమ వద్ద స్టాక్ లేదని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా అడిగితే.. వారు కూడా స్టాక్ అయిపోయిందని అన్నారని ఆర్ఎంఓ తెలిపారు. కరోనా నిబంధనలు అందరూ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు.
ఇదీ చూడండి: ఊపిరి ఉన్నా.. చనిపోయిందని వైద్యుల నిర్ధరణ!