హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముస్లింలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆపన్న హస్తం అందించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో దాదాపు పదివేల మందికి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన వంతు సాయమందిస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు.