ETV Bharat / state

ఏపీ ఎస్ఈసీపై మంత్రుల నోటీసులు విచారణకు స్వీకరణ - శాసనసభ సభాహక్కుల సంఘం ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్ రెడ్డి తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌‌పై ఆ రాష్ట్ర మంత్రులు ఇచ్చిన నోటీసులను విచారణకు స్వీకరించామని... ఏపీ శాసనసభ సభాహక్కుల సంఘం ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నోటీసులపై తప్పనిసరిగా విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

mla kakani govardhan reddy comments on sec nimmagadda ramesh kumar
'ఏపీ ఎస్ఈసీపై మంత్రుల నోటీసులను విచారణకు స్వీకరించాం'
author img

By

Published : Feb 8, 2021, 9:37 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని.. ఏపీ శాసనసభ సభాహక్కుల సంఘం ఛైర్మన్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. వైకాపాను లక్ష్యంగా చేసుకుని, తెదేపాకు అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. నిమ్మగడ్డ చర్యలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు. ఆయనపై మంత్రులు ఇచ్చిన నోటీసులపై తప్పనిసరిగా విచారణ చేపడతామని కాకాణి స్పష్టం చేశారు.

‘హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా తెదేపాకు అనుకూలంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఆలోచిస్తుండటం దురదృష్టకరం. ఎస్‌ఈసీ మితిమీరిన జోక్యంపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇచ్చిన నోటీసులను విచారణకు స్వీకరించాం. దీనిపై తప్పనిసరిగా విచారణ చేపడతాం. వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఎన్నికల కమిషనర్‌ చర్యలు, ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తనపై చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. శాసనసభ రాజ్యాంగ వ్యవస్థ. అది కోర్టుల పరిధిలోకి రాదు. శాసనసభ గానీ, సభాహక్కుల సంఘం తీసుకునే నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోర్టుల్లో కూడా సవాల్‌ చేయలేరు. ఎన్నికలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులను నాటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ తోసిపుచ్చారు. రాజ్యాంగ వ్యవస్థ.. రాజ్యాంగానికి మూలస్తంభమైన శాసనసభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే’

----- కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ శాసనసభ సభాహక్కుల సంఘం ఛైర్మన్

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టెలీహెల్త్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.