ETV Bharat / state

MLA JEEVAN REDDY: రేవంత్ రెడ్డి భాష మార్చుకో.. లేదంటే!

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై రేవంత్‌రెడ్డి పరుషపదజాలం వాడటంపై.. రాహుల్, సోనియాగాంధీకి లేఖ రాసి.. ట్వీట్‌ చేశామని తెలిపారు.

mla-jeevan-reddy-speaks-about-pcc-chief-revanth-reddy-words-on-cm-kcr
రేవంత్ రెడ్డి భాష మార్చుకో.. లేదంటే!
author img

By

Published : Aug 26, 2021, 3:13 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాలేమని గ్రహించే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై రేవంత్‌రెడ్డి పరుష పదజాలం వాడటంపై.. రాహుల్, సోనియాగాంధీకి లేఖ రాసి.. ట్వీట్‌ చేశామని జీవన్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ రెడ్డి భాష మార్చుకో.. లేదంటే!

మీరు తిడ్తే.. మేం తిడ్తం. ఎందుకయ్యా బురదల రాయేసి మూతి మీద చిల్లిచ్చుకుంటరు. మంచిగ మాట్లాడు. మూడు చింతలపల్లి పోయినవ్. అక్కడ ఏమని చెప్తవ్ ఇయ్యాల. 24 గంటల కరెంట్ ఇస్తున్నరు అది వద్దని చెప్తవా..? ప్రతీ ఇంటికి 2 వేల రూపాయల పింఛన్ ఇస్తున్నరు అది కూడా వద్దని చెప్తవా? సీఎం కేసీఆర్ మేనమాన లాగా కల్యాణ లక్ష్మీ కింద డబ్బులు ఇస్తున్నరు.. అది నిజం కాదని చెప్తవా? రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తలేమని చెప్తవా? ఇవన్నీ వాస్తవం కావంటవా..?

- జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖ రాయడం చివరి అస్త్రమని... ఈ లేఖ తర్వాతైనా రేవంత్‌రెడ్డి పద్దతి మార్చుకోవాలన్నారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే అధారాలతో బయటపెట్టాలని జీవన్ రెడ్డి సూచించారు. సొంత పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే ఆక్రోశంతోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి: పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.