ETV Bharat / state

TRS LEADERS: భయంతోనే దిల్లీ నుంచి గల్లీల్లోకి వస్తున్నారు: జీవన్​ రెడ్డి - ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

దిల్లీ అగ్రనేతలందరూ భయంతోనే గల్లీకి వస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గజ్వేల్​ సభలో కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన ఛార్జ్​షీట్ అంతా ఫేక్ అన్నారు. హైదరాబాద్​లోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

trs bhavan
TRS LEADERS
author img

By

Published : Sep 18, 2021, 11:10 PM IST

కాబోయే ప్రధానులుగా చెప్పుకుంటున్న అగ్రనేతలందరూ భయంతోనే దిల్లీ నుంచి తెలంగాణ గల్లీల్లోకి వస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జ్ షీట్ అంతా ఫేక్ అన్నారు. హైదరాబాద్​లోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు. బెల్టు షాపులకు కర్త, కర్మ, క్రియ అన్నీ కాంగ్రెస్సేనని ఆరోపించారు.

రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది..

పీసీసీకి అధ్యక్షుడు రేవంత్ అయినప్పటికీ... రిమోట్ మాత్రం చంద్రబాబు చేతిలో ఉందన్నారు. మీ పార్టీ ఎంపీ శశిథరూర్​ను మాట్లాడిన విధానం చూస్తే నీ నైజమేంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. పదేళ్ల పాటు అధికారం లేదన్న ఆక్రోశంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసేలా గజ్వేల్ సభలో కాంగ్రెస్ నేతల మాటలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్​ను తిట్టడం తప్ప కాంగ్రెస్​కు మరో ఆలోచనే లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. గజ్వేల్ సభకు రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు 2 లక్షల మంది వచ్చినట్లయితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. లేకపోతే పీసీసీకి రేవంత్ రాజీనామా చేస్తారా అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డిది డ్రామా కంపెనీ అని... గజ్వేల్ సభకు 35 వేల మందికి మించి రాలేదన్నారు.

తెరాస నేతలు

దిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద పెద్ద నేతలు ఎందుకు వస్తున్నరు. తెరాస పాలన చూసి ప్రతిపక్ష నాయకులు గజగజ వణుకుతున్నరు. బండి సంజయ్ యాత్ర చేస్తే మేమెందుకు భయపడతాం. రేవంత్ రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంది. తెలంగాణను సహచర ఎంపీ శశి థరూర్​ పొగిడితే ఆయనను కూడా తిడుతున్నడు. సహచర పార్టీ ఎంపీని అలా మాట్లాడుతారా? మద్యం అమ్మకాలకు మీ హయాంలో ఎక్కువ జరిగాయి. - జీవన్ రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్

గజ్వేల్​ సభకు వచ్చింది మీ కార్యకర్తలు మాత్రమే. బయట నుంచి పెయిడ్ వ్యక్తులను తీసుకొచ్చారు. నిజమైన గజ్వేల్ ప్రజలెవరూ కాంగ్రెస్ సభకు రాలేదు. 2 లక్షల మంది వచ్చినట్లయితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.- వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్

ఇదీ చూడండి: REVANTH REDDY: కేటీఆర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డికి రేవంత్‌రెడ్డి వైట్‌ ఛాలెంజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.