ETV Bharat / state

ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారు: జగ్గారెడ్డి - hyderabad latest news

Jaggareddy meet manikrao thackrey in hyderabad: త్వరలో తాను కూడా పాదయాత్ర ప్రారంభిస్తానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ తెలియజేస్తానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేను ఇవాళ మర్యాద పూర్వకంగా కలిసిన జగ్గారెడ్డి.. ఆయనతో పలు కీలక అంశాలను చర్చించారు. కోమటిరెడ్డి అంశం కూడా చర్చకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

జగ్గారెడ్డి
జగ్గారెడ్డి
author img

By

Published : Feb 16, 2023, 4:48 PM IST

Jaggareddy meet manikrao thackrey in hyderabad: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఠాక్రే బాధ్యతలు తీసుకున్నాక వీరిద్దరి మధ్య ఇదే మొదటి సమావేశం. బీఆర్​ఎస్, ​బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై తమ మధ్య చర్చ జరిగినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరాని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించానని తెలిపిన జగ్గారెడ్డి.. పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి చాలా మంది సీనియర్ నాయకులు పాదయాత్ర షెడ్యూల్‌ ప్రకటించారని వివరించారు.

తాను కూడా పాదయాత్రను ప్రారంభిస్తానని, రూట్‌ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారన్నారు. ఆయన చెప్పింది ఒకటైతే మీడియాలో వచ్చింది మరొకటన్నారు. ప్రజలకు అది మరోలా అర్థమైందని.... పొత్తులపై వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్​ పార్టీకి ఎటువంటి నష్టం జరగదు.. జరగలేదు. పార్టీకి నష్టం చేసేలా కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యలతో కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ ఒంటరిగానే పోటీ చేస్తుంది. రాహుల్​గాంధీ కార్యాచరణకు అనుగుణంగా కాంగ్రెస్​ నాయకులందరం పనిచేసి రాష్ట్రంలో 70స్థానాల్లో విజయం కోసం కృషిచేస్తాము. ఆయన నాయకత్వంలోనే మేము సమిష్టిగా పనిచేస్తాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. -జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారన్నారు: జగ్గారెడ్డి

ఇవీ చదవండి:

'తెలంగాణ 'నీటి పరిరక్షణ' విధానాలు భేష్‌.. తక్షణమే పంజాబ్‌లో అమలు'

ఆయన ఓ కోవర్టు.. మంత్రి ఎర్రబెల్లిపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు

'అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేద్దాం.. బీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఆలోచిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.