కరోనా పేరుతో అసెంబ్లీ సమావేశాలకు మీడియాపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు సరికాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం కరోనా పేరిట మీడియా గొంతు నొక్కుతుందని ధ్వజమెత్తారు.
ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా... అమరవీరుల స్తూపమే మీడియాకు వేదికైందన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన తర్వాత కూడా... ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: ఈసారి అద్భుతం జరగబోతుంది: కోహ్లీ