తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి హైకమాండ్ ఆదేశాల మేరకు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. ఇవాళ ఆయన గాంధీ భవన్లో పీసీసీ నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. అంతకుముందే ఆయణ్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. దిగ్విజయ్ సింగ్ తమ సమస్యను పరిష్కారం చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందని జగ్గారెడ్డి పేర్కొనగా.. దిగ్విజయ్ సింగ్ పార్టీలో విభేదాలకు తెర దింపుతారని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు తెర దింపుతారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా మొన్నటి రోజున వేరు సమావేశం పెట్టుకున్నారని...అలాగే తమ పార్టీ నేతలు సమావేశమయ్యారని ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీలో అవసరం ఏర్పడినందునే దిగ్విజయ్ సింగ్ వచ్చారని తెలిపారు.
దిగ్విజయ్ సింగ్ తమ సమస్యను పరిష్కారం చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయ్ సింగ్ చాలా సీనియర్ పేర్కొన్న అయన.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసన్నారు. తన భార్యకు డీసీసీ పదవి అన్నది పెద్ద సమస్య కాదని.. సంగారెడ్డిలో చురుకైన నాయకుడు ఉంటే వారికే డీసీసీ ఇవ్వమని చెప్పినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: