రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వసంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తోన్న భాజపా... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణకు రావాల్సిన వాటా గురించి ఏనాడు పార్లమెంటులో మాట్లాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని తెలిపారు. పట్టభద్రులకు భాజపా ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తాము చేసింది చెప్తామని... వారికి నచ్చిన వారికి ఓటేస్తారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: న్యాయవాదులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం: రామచందర్ రావు