ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నాలాల పూడికతీత పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. నాజర్ స్కూల్ పక్కన, పెద్ద గణేశ్ వెనుక భాగంలో, రాజ్ నగర్లో ఉన్న నాలాల్లో పేరుకుపోయిన చెత్తను త్వరగా తొలగించాలని జోనల్ కమిషనర్ ప్రావీణ్యను దానం ఆదేశించారు. అలాగే నాలాల పక్కనున్న శిథిలావస్తలో ఉన్న ఇళ్లను, నాలాలపై ఏమైనా ఆక్రమణ నిర్మాణాలు ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని కోరారు.
పూడిక తొలగించేందుకు చేపట్టిన వారం రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా బల్కాపూర్ నాలా పనులను పరిశీలించిన దానం... ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వర్షం పడితే ఈ ప్రాంతాల్లో నివసించే వారి ఇండ్లలోకి నీరు చేరుతోందని పేర్కొన్నారు. అలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో నాలాల పూడికతీత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని దానం తెలిపారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?