కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. భాజపా మతతత్వ రాజకీయాలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మతపరమైన వివాదాలు తెరపైకి తీసుకొచ్చి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు మంత్రి కేటీఆర్కు ఉన్నాయని దానం పేర్కొన్నారు. త్వరలోనే కేటీఆర్ సీఎం గద్దెనెక్కుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ.. హైదరాబాద్ నందినగర్ మైదానంలో.. కేసీఆర్, కేటీఆర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
- ఇదీ చూడండి : మంత్రులకు నిరసన సెగ.. సర్పంచ్ల నిలదీత!