ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని కమేల బస్తీలో వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని మానవత్వంతో ప్రజలను ఆదుకోవాలన్నారు.
అత్యవసర వరద సహాయం కింద ఎనిమిది కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే దానం అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న సహాయంపై భాజపా నాయకులు విమర్శించండం సమంజసం కాదన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా.. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని దానం స్పష్టం చేశారు.
ఇవీచూడండి: వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు