MLA Burra Madhusudan in AP: ఏపీలో వైసీపీ నాయకులు చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఎక్కడి వెళ్లినా వారిపై ప్రజలు సమస్యలనే బాణాలను ఎక్కు పెడుతున్నారు. నాయకులు వాటి నుంచి తప్పించుకోడానికి నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ.. దాటవేస్తున్నారు. దీనిలో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌కు చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌కు నిరసన సెగ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను గత నాలుగేళ్లుగా తమ ప్రాంతంలో రోడ్డు, మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యేని నిలదీశారు.
వర్షం పడితే చాలు రోడ్డు లేక పిల్లలను స్కూలుకు పంపాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగేందుకు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మీరు ఏం చేశారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ త్వరలో రోడ్డు వేస్తామంటూ సమాధానం దాటవేసి ముందుకు వెళ్లగా అక్కడ మరో మహిళ తమ కష్టంపై తమ బతుకుతున్నామని మీరు మాకు ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఎవరికి చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదు. రోడ్డులేక ఒక మంచినీళ్ల బండి రాదు, వర్షం పడితే చాలు స్కూలుకు పిల్లలను పంపాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాము. ఇలా చేస్తే ఈ గల్లి నుంచి ఒక్క ఓటు కూడ వేయము. ఎన్నేళ్ల నుంచి చేస్తామని చెప్తారు. నాలుగు సంవత్సరాల ఇదే చెప్తున్నారు. అప్పటి నుంచి మాకు ఏం చేశారు." -స్థానిక మహిళ
ఇవీ చదవండి :