హైదరాబాద్, ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను.. సుందరీకరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో కలిసి రామంతాపూర్లోని చెరువులను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో.. డంపింగ్ యార్డ్, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఉప్పల్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో పొదుపు సంఘాల మహిళల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శాంతినగర్లో జరుగుతోన్న కాలువ పూడిక తీత పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హబ్సీగూడ కార్పొరేటర్ బండారు శ్రీవాణి, రామంతాపూర్ కార్పొరేటర్ చేతనలతో కలిసి పరిశీలించారు.
ఇదీ చదవండి: Etela: 'ఈటల.. సీఎం పదవి కోసం ఆశపడుతున్నారు'