ప్రతి ఒక్కరు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సూచించారు. స్వచ్ఛమైన ఆహార ఫలాలు ఆరోగ్య పరిరక్షణకు సంజీవినిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజూ పండ్లు, ఆకు కూరలు తీసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ మదీనగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 29వ ఔట్‌లెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆస్ట్రేలియా, వాషింగ్టన్, థాయిలాండ్, యూఎస్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసిన విభిన్న రకాలైన ఫలాలను నగరావాసులకు అందిస్తున్నట్లు ఔట్‌లెట్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
ఇందులో 25 రకాలైన విదేశీ ఉత్పత్తులతో పాటు ఆంధ్ర, తెలంగాణలో పండించిన ఆకుకూరలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, పూజితగౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రబ్బర్లా సాగుతోన్న అన్నం.. బియ్యం దుకాణం వద్ద ఆందోళన