హైకోర్టు భవనాన్ని ఎక్కడకీ తరలించకూడదని ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అంతగా కావాలనుకుంటే సిటీ కళాశాల భవనానికి హైకోర్టును తరలించాలని సూచించారు. నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యురేనియం తవ్వకాలను జరిపితే... 15 మండలాలకు చెందిన 70 వేల మంది ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని, అక్కడున్న ఆదివాసీలను, వన్యప్రాణులను సంరక్షించాలని కోరారు.
ఇవీ చూడండి: 'మూడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి భారం కాదా..?'